Taapsee Pannu marriage | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘తాప్సీ’. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఈమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్గా నటించే పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ఇక బాలీవుడ్లో ఈమె పట్టిందల్లా బంగారమే అయింది. ఈమె నటించిన ప్రతి సినిమా కొత్తగా ఉండటంతో పాటు తాప్సీ తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈమె పెళ్ళిపీటలెక్కబోతుందని సమాచారం.
తాప్సీ గత కొంత కాలంగా ప్రముఖ బ్యడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌తో ప్రేమలో ఉంటుంది. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట. అంతే కాకుండా వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఖరారయినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన ఉందనుందట. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో ‘మిషన్ ఇంపజిబుల్’ చిత్రంలో నటిస్తుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దీంతో పాటుగా తాప్సీ ప్రస్తుతం అరడజను సినిమాలలో నటిస్తుంది.