స్త్రీ ప్రాధాన్యతతో కూడిన కథలను ఎంచుకుంటూ కథానాయికగా భిన్నమైన ప్రయాణాన్ని సాగిస్తున్నది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె ‘గాంధారి’ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో కనికా థిల్లాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
పల్లెటూరి యువతిగా ఇందులో తాప్సీ నటిస్తున్నట్టు ఆమె తన ఇన్‌స్టాలో పొందుపరచిన స్టిల్స్ చెబుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ సినిమా స్టిల్స్‌తోపాటు ఓ క్యాప్షన్‌ని జత చేసింది తాప్సీ. ‘ప్రియమైన దేవుడా.. నన్నెప్పుడూ మంచికి దూరం చేయకు. నా అభ్యర్థనను మన్నించి నాకు విజయాన్ని కటాక్షించు’ అనేది ఈ క్యాప్షన్ సారాంశం. వచ్చేఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.