సందేశాత్మకంగా ‘వేదవ్యాస్’
సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ మెగా ఫోన్ పట్టి, ‘వేదవ్యాస్' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది దర్శకునిగా ఆయన 43వ చిత్రం కావడం విశేషం. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రగతి ఫిల్మ్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు.
సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ మెగా ఫోన్ పట్టి, ‘వేదవ్యాస్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది దర్శకునిగా ఆయన 43వ చిత్రం కావడం విశేషం. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రగతి ఫిల్మ్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం కె.అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బర్త్‌డే వేడుకల్లో ‘వేదవ్యాస్’ కథానాయకుడు పిడుగు విశ్వనాథ్‌ను మీడియాకు పరిచయం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తను ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా నటించాడు. ఇందులో వేదనారాయణ అనే పాత్ర కీలకం. ఆ పాత్రను సాయికుమార్ పోషించారు.
కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ కథానాయికగా నటిస్తున్నది. తను తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం చాటేలా సినిమా ఉంటుంది.’ అని తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి పట్టుదలతో తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇదని, అయిదారేళ్లుగా ఆయన ఈ మూవీ కోసమే వర్క్ చేస్తున్నారనీ, సినిమా బాగా వస్తున్నదని, రషస్ చూశాక ఎస్వీకృష్ణారెడ్డి జడ్జిమెంట్ ఎంత గొప్పదో అర్థమైందని, కొమ్మూరి ప్రతాపరెడ్డి మంచి ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమర్పకుడు అచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఇంకా హీరో పిడుగు విశ్వనాథ్, నటుడు సాయికుమార్, జర్నలిస్ట్ ప్రభు, పిడుగు సుబ్బారావు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

