బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పలు భాషలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సన్నద్ధమైంది.అయితే ఈ షోఎప్పుడు మొదలు కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 5 నుండి షో ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు.
గురువారం రోజు బిగ్ బాస్ షో. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుందని తెలియజేశారు.ఈ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో అనందం అవధులు దాటింది. కాని అంతలోనే షాకింగ్ న్యూన్ ఒకటి బయటకు వచ్చింది.
కరోనా నిబంధనల ప్రకారం ప్రస్తుతం హౌజ్‌లోకి వెళ్లే వారిని క్వారంటైన్‌కి తరలించగా, అందులో కొందరికి పాజిటివ్ అని తేలిందట. దీంతో ఈ షోపై నీలి నీడలు కమ్ముకున్నాయి. షోని వాయిదా వేస్తారా, లేదా వేరే కంటెస్టెంట్స్‌తో చెప్పిన టైంకి రన్ చేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.