ANR| టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని చెన్నై నుండి హైదరాబాద్‌కి తీసుకురావడానికి ఏఎన్ఆర్ పాత్ర ఎంతో ఉంది. టాలీవుడ్‌కి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లుగా చెప్పవచ్చు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తుంటాయి. అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున కాకుండా ఇంకో కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కినేని నాగేశ్వరావు మరో హీరోని దత్తత తీసుకున్న విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ హీరో ప్రకటించాడు. ఇంతకు ఆ హీరో ఎవరు అనే కదా మీ డౌట్. అతను మరవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, హీరో సుమంత్.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి – యార్లగడ్డ సురేంద్రల కొడుకు సుమంత్ యార్లగడ్డ కాగా, సుమంత్ ని అక్కినేని నాగేశ్వరరావు దత్తత తీసుకున్న విషయాన్ని సుమంత్.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రివీల్ చేసి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. తాజా ఎపిసోడ్‌కి సుమంత్ గెస్ట్ గా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఈ షోలో ఫాదర్స్ గురించి ప్రస్తావన రాగా సుమంత్ మాట్లాడుతూ.. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు. నా బర్త్ ఫాదర్ సురేంద్ర కాగా, మా తాత గారు అక్కినేని నాగేశ్వర రావు గారు నన్ను దత్తత తీసుకున్నారు అని అన్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్ అని తెలిపారు.
ఇప్పుడు ఈ విషయం తెలియడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా సుమంత్ ని నాగేశ్వరరావు దత్తత తీసుకోవడం గొప్ప విషయం అంటూ కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. కాగా, అక్కినేని హీరో సుమంత్.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. హీరోగా ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని, ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు.. ఎదురవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు.. చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నారు. సుమంత్ ప్రేమకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా.. వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా చేశాడు.