బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Aug 14, 2020 , 10:16:24

సుశాంత్ డైరీలో ఆస‌క్తిక‌ర అంశాలు..!

సుశాంత్ డైరీలో ఆస‌క్తిక‌ర అంశాలు..!

ఎన్నో క‌ల‌లు క‌న్న సుశాంత్ అర్ధాంత‌రంగా త‌నువు చాలించి  అంద‌రికి తీర‌ని విషాదాన్ని మిగిల్చాడు. ఆయ‌న ప్ర‌ణాళిక‌లు, క‌న్న క‌ల‌లు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డుతుండ‌గా, వాటిని చూసి అభిమానులు ఎంతో భావోద్వేగానికి గుర‌వుతున్నారు. సుశాంత్ ..చిత్రాల‌లో పోషించిన పాత్ర‌ల‌ని వివ‌రంగా విశ్లేషించి, ప్ర‌తి సంవ‌త్స‌రంలో కొన్ని ల‌క్ష్యాల‌కి సంబంధించిన జాబితా సిద్ధం చేశాడు. 

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ త‌న డైరీలో 2020 నాటికి అత‌ను సాధించాల‌ని అనుకున్న జాబితా సిద్ధం చేశాడు.  ప్రేక్ష‌కులు మీ మీద న‌మ్మకం కోల్పోకుండా చేయాలి. పాత్ర‌ల‌ని ఇష్ట‌ప‌డి చేయాలి. ముందుగా అర్ధం చేసుకోవాలి.  ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైన ఏదో ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి, అని న‌ట‌న గురించి కొంత రాసుకున్నాడు.

ఇక త‌న‌లోని న‌టనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవ‌డం, హాలీవుడ్‌ల‌ని అగ్ర ఏజెన్సీతో అనుబంధం పెంచుకోవ‌డం, అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్ల‌తో సంబంధాలు, సినిమా, విద్య‌, ప‌ర్యావ‌ర‌ణం ఇలా తాను సాధించాల్సిన ల‌క్ష్యాల‌ని ఓ జాబితాగా రూపొందించుకున్నాడు. ముఖ్యంగా త‌న ల‌క్ష్యాల‌లో ఆస్తి సృష్టి అనే విభాగం కింద 50 కోట్ల జాబితా రెడీ చేశారు.  తన ఖర్చును  స్థిర ఆదాయానికి మార్చి  లాస్ ఏంజిల్స్‌లో ఓ ఇంటిని  కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేశాడు. "విజన్" అనే విభాగం కింద, అతను ఈ సంవత్సరం నాటికి హాలీవుడ్‌లో ప‌ని చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకున్నాడు. కాని అవ‌న్నీ నెర‌వేర్చుకోకుండానే అర్ధాంత‌రంగా క‌న్నుమూశాడు.


logo