Sushant – Meenakshi | సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ ఒకే చిత్రంలో కనిపించినా లేదా తరచూ కలుసుకుంటే, వారి మధ్య ఏదో ఉందని పుకార్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా, టాలీవుడ్ యాక్టర్ సుశాంత్ మరియు నటి మీనాక్షి చౌదరి జంట వార్తలలోకి ఎక్కారు. తాజాగా ఈ జంట ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందంటూ పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఆ వీడియోలో మీనాక్షి ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్‌బ్యాగ్ తో నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్‌ను పట్టుకుని ఉన్నాడు. వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మీనాక్షి చౌదరి 2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో హీరోగా సుశాంత్ నటించగా, అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ రూమర్స్ తెగ వెలువడుతున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. వీటి గురించి మీనాక్షి పలు ఇంటర్వ్యూలలో స్పందిస్తూ.. “సుశాంత్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే” అని స్పష్టంగా చెప్పింది. అయినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.
ప్రస్తుతం మీనాక్షి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలి కాలంలో జపాన్ ట్రిప్‌కి వెళ్లిన ఆమె, అక్కడి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ సందడి చేసింది. ఇప్పుడు ఈ కొత్త వైరల్ వీడియోతో మళ్లీ మీనాక్షి – సుశాంత్ జంట చర్చల్లోకి వచ్చింది. దీనిపై ఇద్దరూ ఏదైనా అధికారికంగా క్లారిటీ ఇస్తారో లేదో తెలియదు కానీ, అప్పుడప్పుడూ ఇలా బయట కలిసి కనిపించడం అభిమానుల ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేస్తోంది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.