Suriya 46 | తమిళ నటుడు సూర్య నేడు తన 50వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా సూర్య నటిస్తున్న కరుప్పు సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ టీజర్. ఇదిలావుంటే టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. నేడు సూర్య బర్త్‌డే కావడంతో అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
Wishing our Hero @Suriya_offl garu a fantastic birthday!
An actor who keeps setting the bar higher. We’re beyond excited to show you all the vintage Suriya garu in #Suriya46 🔥#HBDSuriyaSivakumar #HappyBirthdaySuriya #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/csosk4aEqX
— Naga Vamsi (@vamsi84) July 23, 2025