ఇటీవలే పీరియాడిక్ చిత్రం ‘కంగువ’తో ప్రేక్షకుల ముందుకొచ్చా రు తమిళ అగ్ర హీరో సూర్య. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో సూర్య తన 45వ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం తమిళనాడులోని అన్నామలైలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కోయంబత్తూర్‌లో తొలి షెడ్యూల్ జరుగుతుందని, సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.