Tourist Family Movie | తమిళం నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు స్టార్ హీరో సూర్య. అనంతరం టీమ్‌ని ఇంటికి పిలిపించుకొని చిత్రబృందాన్ని అభినందించాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
తమిళ నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్ కూడా ఈ సినిమా చూసి చిత్రబృందంని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. ఇటీవలే ఈ సినిమాపై స్టార్ దర్శకుడు కూడా రాజమౌళి కూడా స్పందిస్తూ.. ఫిదా అయినట్లు తెలిపాడు.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన సూర్య చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అభిషన్ జీవింత్ ప్రత్యేకంగా కలుసుకున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.
మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
This day !!
Simply the best. ❤️With “The One”
As the biggest fanboy of @Suriya_offl sir, moments like these feel like magic ✨
Grateful for the genuine convo around #TouristFamily and yeah, beyond thrilled about the edit work that made it all hit different.#suriya pic.twitter.com/BYVPjoWHYz— Barath Vikraman (@barathvikraman) May 23, 2025