తమిళ అగ్ర కథానాయకుడు సూర్య 45వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆర్.జె.బాలాజీ దర్శకుడు. ప్రతిష్టాత్మక డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు బాలాజీ ఈ సినిమా స్క్రిప్ట్‌కే ఏడాది సమయం కేటాయించారనీ, సరైన లోకేషన్స్కోసం ఎంతో శ్రమించామని నిర్మాతలు తెలిపారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ఇండియా చిత్రంలో ప్రముఖ నటీనటులు, ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని, ఈ ఏడాది నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామని వారు చెప్పారు.