భిన్నమైన కథల్ని రాసుకొని, వాటిని విభిన్నంగా మలచడంలో దర్శకుడు వెంకీ అట్లూరి దిట్ట. తొలిప్రేమ, సార్, లక్కీభాస్కర్.. ఈ మూడు సినిమాలే అందుకు సాక్ష్యాలు. ప్రస్తుతం ఆయన తమిళ అగ్రహీరో సూర్యతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
మమితా బైజు కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో సందడి చేస్తున్నది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ టైటిల్ సినీ సర్కిల్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నది. మారుతి కారు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అందులో నిజానిజాలు తెలియాల్సివుంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.