Suriya 42 | యుద్ధ వీరుడిగా సూర్య.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘సూర్య42’ మోషన్ పోస్టర్
Suriya42 Motion Poster | తమిళంతో పాటు తెలుగులో కూడా సమానంగా క్రేజ్ దక్కించుకున్న నటుడు సూర్య. రజినీకాంత్. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రబృందం తాజాగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన మోషన్‌పోస్టర్ వేరే లెవల్లో ఉంది. మోషన్ పోస్టర్‌లోని గ్రాండియర్ విజువల్స్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా 3డీలో పది భాషల్లో రూపొందుతున్నట్లు వెల్లడించారు. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా దిశా పటాని నటిస్తుంది.
Read Also:
RC15 Movie | శంకర్-రామ్‌చరణ్ మూవీలో తమిళ స్టార్ డైరెక్టర్..!
Ahimsa Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న తేజ ‘అహింస’ గ్లింప్స్..!
Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
Vikram Veda | ‘విక్రమ్ వేద’ హిందీ ట్రైలర్ రిలీజ్.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

