Vikram Veda Trailer | హృతిక్ రోషన్.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం ఉన్న బాలీవుడ్ హీరో. ‘క్రిష్’ సిరీష్, ‘ధూమ్-2’, ‘జోదా అక్బర్’ వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రాల తర్వాత ఈయన నటించిన హిందీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూడటం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈయన సైఫ్ ఆలీఖాన్‌తో కలిసి నటించిన ‘విక్రమ్ వేద’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన పుష్కర్- గాయత్రి హందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన విక్రమ్ వేద ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో హృతిక్ వేద పాత్రలో గ్యాంగ్‌స్టార్‌గా నటించగా.. సైఫ్ ఆలీఖాన్ విక్రమ్ పాత్రలో పోలీస్ ఆఫిసర్‌గా నటించాడు. ఈ రీమేక్ చిత్రాన్ని గ్రాండియర్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
Read Also:
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Nane Varuven | ‘నానే వరువెన్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మరోసారి మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన యువన్
Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలలు బయటకు రాలేదట..!