Nane Varuven | ‘నానే వరువెన్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మరోసారి మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన యువన్
Nane Varuven First Single | ఇటీవలే ‘తిరు’తో భారీ విజయాన్ని సాధించాడు ధనుష్. గత నెల 18న విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా తిరు మూవీ నిలిచింది. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సార్’ చిత్రీకరణ దశలో ఉండగా.. ‘నానే వరువెన్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నానే వరువన్ చిత్రానికి సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని ‘వీర శూర’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. యూవన్ శంకర్ రాజా స్వర పరిచిన ఈ పాటను తనే స్వయంగా ఆలపించాడు. ఈ పాటలో ధనుష్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. యూవన్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఈ చిత్రంలో ధనుష్ డ్యయల్ రోల్లో నటించాడు. హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను ధనుష్ ఈ చిత్రంలో పోషించాడు. సెల్వరాఘవన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించాడు ధనుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్రమ్ హీరోయిన్గా నటించింది.
Read Also:
Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలలు బయటకు రాలేదట..!
Samantha | సమంత రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన జోసెఫ్ ప్రభు..!
Rajinikanth | ‘నరసింహ’కు ‘పొన్నియన్ సెల్వన్’ స్పూర్తి..తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
Nandamuri Mokshagna | ఏంటీ..హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీకి ఛాన్స్ లేనట్టేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

