Ahimsa Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న తేజ ‘అహింస’ గ్లింప్స్..!
Ahimsa Movie Glimpse | కథా బలమున్న సినిమాలను తెరకెక్కిస్తూ, కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తేజ. ఇప్పటివరకు ఈయన ఎంతో మంది కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈయన ‘అహింస’ అనే విభిన్న ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలోనే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం కరోనా కారణంగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదలైన అభిరామ్ ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అభిరామ్‌ను ఓ నలుగురు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్లు వెంటబడి మళ్ళీ అభిరామ్‌ను పట్టుకుంటారు. ఆపై రక్తం వచ్చేలా కొడతారు. లేటెస్ట్గా విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్గా నటించింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలన్ని మ్యూజికల్‌గా మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా పాటలు అద్భుతంగా ఉంటాయిని మేకర్స్ వెల్లడించారు.
Read Also:
Sita Ramam | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సీతారామం’.. ఏ ప్లాట్‌ఫామ్ అంటే?
Big Boss 6 | రేవంత్‌ను టార్గెట్ చేసిన గీతూ రాయల్.. వత్తాసు పలికిన ఆదిరెడ్డి
Charmee Kaur | అవన్నీ పుకార్లే..ట్వీట్‌తో నెటిజన్లకు ఛార్మీ క్లారిటీ
Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

