Sita Ramam On OTT | ఈ ఏడాది బ్లాక్బాస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే 80కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా సీతారామం అనూహ్య రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మహానటితో తెలుగు ప్రేక్షకులకు పరిచియమైన దుల్కర్ తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకన్నాడు.
ఓటీటీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సీతారామం’ గత రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది. సుమంత్, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్న దత్ నిర్మించారు.