Big Boss 6 Telugu Highlights | బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. తొలివారం కాకముందే హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీజన్ 6లో సింగర్ రేవంత్ కంటెస్టెంట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. రేవంత్‌కు అందరూ హౌస్ మేట్స్ వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాదు రేవంత్ ఆట కారి కాదు మాట కారి అంటూ జబర్ధస్త్ ఫైమా అనగా .. నా వాయిస్ అంతే అంటూ రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గీతూ రాయల్, రేవంత్ ను టార్గెట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. గీతూ రాయల్ మొదటి నుండి హౌస్ మేట్స్‌తో ఓవర్‌గా బిహేవ్ చేస్తుంది. ఇక చంటి లోనీ తప్పులను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ఇక హౌస్మేట్స్ అందరూ కూర్చొని పరిష్కరించుకుందాం అంటూ రిక్వెస్ట్ చేయడంతో గీతూ రాయల్, చంటి వెళ్లిపోయారు.
గీతూ, చంటి విషయంలో తన ఫ్రస్టేషన్ అంతా బయటకు పెట్టింది. ఇక చంటి మాత్రం చాలా కూల్ గా గీతూకి వివరించే ప్రయత్నం చేశాడు. గీతూ.. రేవంత్ బిహేవియర్ మారాలి, ఇలానే ఉంటే హౌస్‌లో నుండి వెళ్లిపోతాడు అంటూ అర్జున్, ఆదిరెడ్డిలతో అంటుంది. అంతేకాదు రేవంత్ బయటకు వెళ్ళిపోతేనే ఆయన కెరీర్ బాగుంటుంది అన్నట్లుగా కూడా చెప్పింది. దీనికి ఆదిరెడ్డి కూడా గీతుకు వత్తాసు పలికాడు.
మరి ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.