Allu Arjun | ఆ పాన్ ఇండియా దర్శకుడితో అల్లుఅర్జున్ నెక్స్ట్ చిత్రం?
Allu Arjun Next Movie | అల్లుఅర్జున్ కెరీర్లో ‘రేసుగుర్రం’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘రేసుగుర్రం’ సినిమాకు ముందు బన్నీ కెరీర్లో హిట్లు పడుతున్నాయి కానీ, కమర్షియల్ స్టేటస్ మాత్రం రావడంలేదు. ఈ క్రమంలో రేసుగుర్రం సినిమా బన్నీని స్టార్ హీరో చేసింది. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది. ఈ సినిమాతో అల్లుఅర్జున్ 100కోట్ల మార్కును అందుకున్నాడు. అంతేకాకుండా రూ.59.60 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను సాధించి ఆ ఏడాది మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. సురేందర్ రెడ్డి స్క్రీన్-ప్లే, టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళాయి. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి పేరు టాలీవుడ్లో మారు మొగిపోయింది. ఈ సినిమాతో ఈ ఇద్దరు గ్రాండ్‌గా కంబ్యాక్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
‘పుష్ఫ’ సినిమాతో బన్నీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం రూ.350కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి బన్నీను పాన్ ఇండియా స్టార్‌గా చేసింది. ప్రస్తుతం ఈయన పుష్ఫ సీక్వెల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా బన్నీ, సురేందర్ రెడ్డితో రెండో సినిమాకు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి ఇప్పటికే ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్‌ను బన్నీ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన స్క్రీప్ట్‌ను డెవలప్ చసే పనిలో ఉన్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Also:
Varalaxmi Sarathkumar | క్రేజీ టాక్..ఎన్బీకే 107లో ట్విస్టులతో వరలక్ష్మి పాత్ర..!
Vikram Veda | ‘విక్రమ్ వేద’ హిందీ ట్రైలర్ రిలీజ్.. !
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Sharwanand | ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శర్వానంద్ మూడు నెలల వరకు రూమ్ నుండి బయటకు రాలేదట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

