Suriya42 Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటులలో సూర్య ఒకడు. సూపర్ స్టార్ రజిని, లోకనాయకుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో సూర్య టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నాడు. సూర్య సినిమా రిలీజవుతుందంటే తెలుగులో కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరో రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతుంటాయి. ఈ ఏడాది ఈటీతో సూర్యకు ఆశించిన స్థాయి ప్రారంభం దక్కలేదు. దాంతో ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం సూర్య మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రాన్ని ముందుగా మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ముఖ్య పాత్ర వహిస్తుందట. ఈ క్రమంలో సినిమా లేటయినా సరే.. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలని 2024కు పోస్ట్ పోన్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన మోషన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని పది భాషల్లో ౩డీలోనే రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటిస్తుంది.