Vishwanath & Sons | సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ ఖరారు!
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' విడుదల తేదీ తాజాగా ఖరారైంది.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఈ డేట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో కలిసి ఒక విలక్షణమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకు ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమాలో సూర్య 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ ‘సంజయ్ విశ్వనాథ్’ పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించబోతుండగా.. సూర్య సరసన యంగ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, మరియు భవాని శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
From my favourites #VenkyAtluri and @gvprakash… see u all soon!
Eid Mubarak! #VishwanathAndSons from 14th August@NimishRavi @_mamithabaiju @realradikaa akka @TandonRaveena @SitharaEnts @vamsi84 pic.twitter.com/xtUfvIxQup— Suriya Sivakumar (@Suriya_offl) May 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

