Suriya Jyothika |తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముంబైకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై మహానగరం నుంచే తన సినిమాల షూటింగ్లలో పాల్గోంటున్నాడు ఈ నటుడు. అయితే తాను ముంబై షిఫ్ట్ అవ్వడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించాడు సూర్య. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు సూర్య. అయితే రీసెంట్గా ఒక ఆంగ్ల ఇంటర్వ్యూలో పాల్గోన్న సూర్య తాను ముంబై షిఫ్ట్ అవ్వడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
తనకి 18 ఏండ్ల వయసులో జ్యోతిక ముంబై నుంచి చెన్నైకి వచ్చింది. ఈ క్రమంలోనే 2006లో మా పెళ్లి కూడా అయ్యింది. నా పెళ్లి అనంతరం దాదాపు 27 ఏండ్లుగా తాను ఇంటిని మిస్ అవ్వుతూ చెన్నైలోనే ఉంటుంది. ఆమె సర్వస్వం త్యాగం చేసి నా కోసం వచ్చింది. అందుకే తనకోసం నేను ముంబై షిఫ్ట్ అయ్యాను. ఫురుషులకు ఏం అవసరం అవుతాయో అలాగే మహిళలకు కూడా అలాంటి అవసరాలే ఉంటాయి. అవి మనం ఆలోచించుకోని చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పనులే వారికి ఆనందన్ని ఇస్తాయి. అందుకే తన కోసం నేను ముంబైకి వచ్చాను అంటూ సూర్య వెల్లడించాడు.
Q: Why you have moved to Mumbai❓#Suriya: Jyothika was in Mumbai for 18Years & she shifted to Chennai for me about 27 years. She sacrificed everything & came for me. Whatever a man needs a woman also needs that so again shifted to Mumbai for her & Kids❤️pic.twitter.com/jc1VeYMkT8
— AmuthaBharathi (@CinemaWithAB) October 29, 2024