Retro Movie | తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు.
మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తమిళంలో మాత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన కంగువ ఆశించిన విజయం సాధించకపోయినా, రెట్రో మిశ్రమ టాక్‌తో కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించడం సూర్య క్రేజ్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విడుదలైన 7 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం పట్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
BREAKING: Retro ENTERS ₹100 cr club.
8️⃣th film of Suriya to achieve this HUMONGOUS milestone. pic.twitter.com/mCzNlorwBy
— Manobala Vijayabalan (@ManobalaV) May 6, 2025