లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన సూర్య కోర్ట్‌రూమ్ డ్రామా ‘జై భీమ్’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో లాయర్ చంద్రుగా సూర్య అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య ఓ చిత్రానికి అంగీకరించినట్లు తెలిసింది.
‘జై భీమ్’ తరహాలోనే బలమైన సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ సినిమా సాగుతుందని, కథలోని పాయింట్ సూర్యను బాగా ఇంప్రెస్ చేసిందని చెన్నై ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం సూర్య ‘కరుప్పు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకురానుంది.