Suriya – Jyothika | ఇటీవల ‘రెట్రో’ సినిమాతో సూపర్‌హిట్‌ను అందుకున్న తమిళ నటుడు సూర్య.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌నిచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తాజాగా తన భార్య నటి జ్యోతికతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడు. ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌కు ఈ జంట విహార యాత్రకు వెళ్లింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీరిద్దరూ సేదతీరారు. దీనికి సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోలను జ్యోతిక ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అని క్యాప్షన్ ఇచ్చింది.
సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. దీనితోపాటు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’లో సూర్య నటిస్తున్నారు. జ్యోతిక విషయానికి వస్తే.. ఇటీవల డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Beautiful recent photos of #Suriya & #Jyothika ♥️ pic.twitter.com/ztt0jRO2Ld
— Happy Sharing By Dks (@Dksview) June 28, 2025
Beautiful recent photos of #Suriya & #Jyothika ♥️ pic.twitter.com/4t8EwkaC9E
— Happy Sharing By Dks (@Dksview) June 28, 2025