కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య 47వ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ‘సూర్య 47’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకుడు. ‘రోమాంచమ్’ సినిమాతో మలయాళంలో తొలి విజయాన్ని అందుకున్న జీతూ మాధవన్, రీసెంట్గా ఫహాద్ ఫాజిల్‌తో ‘ఆవేశం’ సినిమాను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. సూర్య, జీతూ మాధవన్ కాంబినేషన్లో సినిమా అనగానే.. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నజ్రియా ఇందులో కథానాయిక. ‘ప్రేమలు’ఫేం నస్లేన్ కీలక పాత్రధారి.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాశ్, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని కూడా మొదలుపెట్టారు. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని, అద్భుతమైన పాత్రలో సూర్య కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సూర్య సతీమణి, నటి జ్యోతిక, హీరో కార్తి, నిర్మాత రాజశేఖర్ పాండియన్ కూడా హాజరయ్యారు. జాన్ విజయ్, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వినీత్ ఉన్ని పలోడే, సంగీతం: సుషిన్ శ్యామ్.