Suriya 44 | తమిళ స్టార్ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా సాలిడ్ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు షాకింగ్ వార్త పంచుకుంది.
ఈ మూవీ అనౌన్స్మెంట్ 2024 మార్చి 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 02న షూటింగ్ స్టార్ట్ చేయగా.. అక్టోబర్ 06న షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
A wholesome, happy shoot got done across several locations… Lots of memories with the super talented cast & crew… I made a brother for life @karthiksubbaraj thank you & our team for making #Suriya44 a memorable experience. #ShootWrap pic.twitter.com/DIRtILfpP3
— Suriya Sivakumar (@Suriya_offl) October 6, 2024