Suriya 43 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజీ ఎలా ఉంటుందో మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్ననవసరం లేదు. ఈ టాలెటెంట్ యాక్టర్ ప్రస్తుతం పీరియాడిక్ మూవీ కంగువ (Kanguva)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సూర్య 42 (Suriya 42) గా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర (Sudha Kongara) డైరెక్షన్లో సూర్య 43 కూడా ప్రకటించాడని తెలిసిందే.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అప్డేట్తోపాటు సూర్య అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం సూర్య 43 షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానుంది. ఇక వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 పూర్తి చేసిన తర్వాత వాడివాసల్ షూటింగ్ కూడా మొదలు కానుంది. లోకేశ్ కనగరాజ్ వినిపించిన రోలెక్స్ (Rolex) క్యారెక్టర్‌తో సాగే కథ సూర్యను ఇంప్రెస్ చేసిందట. రోలెక్స్ తర్వాత Irumbu Kai Mayavi టైటిల్‌తో రాబోతున్న మూవీ పనులు కూడా షురూ అవకాశాలున్నట్టు సమాచారం.
సూర్య 43 గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండనుందని టాక్ నడుస్తుండగా.. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే కంగువ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కంగువ ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య మరోవైపు అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కంగువ విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..