సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వ్యవస్థలోని అన్యాయాలు, అక్రమాలపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నదే ఈ సినిమా కథాంశమని చిత్ర బృందం పేర్కొంది. కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, అభిరామి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఆర్.కతీర్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: కె.ఖధీర్, రచన-దర్శకత్వం: టీజే జ్ఞానవేల్.