స్టార్ హీరో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్న సినిమా ‘లాల్ సలామ్’. ఈ చిత్రానికి ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో మంటల్లో కాలిపోతున్న క్రికెట్ కిట్ కనిపిస్తున్నది. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.