Rajinikanth Next Movie Title | సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు తెలియని సినీప్రేక్షకుడు ఉండడేమో. సౌత్ నుంచి నార్త్ వరకు సినీ ప్రముఖులు సైతం ఈయనకు వీరాభిమానులే. అయితే గత కొంత కాలంగా రజినీకాంత్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి ‘రోబో’ తరువాత ఇప్పటివరకు రజినీకి ఆ స్థాయి హిట్ లేదు. మధ్యలో భారి అంచనాలతో విడుదలైన ‘కబాలి’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే 2019లో వచ్చిన ‘పేట’ మాత్రం మంచి విజయం సాధించింది. కానీ అభిమానులకు మాత్రం ఫుల్ మీల్స్ పెట్టలేకపోయింది.
ఇక దీని తర్వాత వచ్చి న ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాలు పరాజయాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం రజినీ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే నెల్సన్‌తో చేతులు కలిపాడు. ‘డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్.. బీస్ట్ వంటి భారీ ఫ్లాప్ కూడా ఇచ్చాడు. అయినప్పటికి రజినీకాంత్, నెల్సన్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక చైన్‌కు రక్త సిక్తమైన కత్తిని వేలాడదీశారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించనుంది. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి అగ్ర నటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ మొదలు పెట్టనుంది.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022