తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం అగ్రహీరో మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ కనిపించింది. రాజకీయాల్లోని అవినీతిని బయటపెట్టే ధైర్యవంతురాలైన పాత్రికేయురాలిగా ఆమె పాత్ర సాగింది. అసాధ్యమనుకున్న ఓ ఆపరేషన్‌ను ఆమె ఎలా పూర్తి చేసిందన్నది చిత్రంలో ఆసక్తికరమైన అంశమని, తాప్సీ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని దర్శకుడు తెలిపారు. సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: స్వరూప్.