నాగార్జున సిరి, షణ్ముఖ్‌లని పిలిచి క్లాస్ పీకిన కూడా వారిలో ఏ మార్పు రాలేదు. పక్క బెడ్‌పై షణ్ముఖ్ ఉండగా.. సిరి తన బెడ్‌పై పడుకుంటూ.. ఐ యామ్ ఇండివిడ్యువల్ అని పేపర్‌పై రాసి తన షణ్ముఖ్ చూసే విధంగా తన బెడ్‌కి అంటించుకుంది. అది చూసిన షణ్ముఖ్ ..అలా పెట్టి నిన్ను నువ్వు జోక్ చేసుకోవద్దు. జనం నీ గురించి మాట్లాడుకోవాలనే అలా పెట్టావ్ అని అన్నాడు.
మనిద్దరి సీన్‌ని అందరికీ చూపిస్తున్నావ్.. దీన్నే ఆపుకోమని చెప్తున్నా.. ఇంకొకరు మన గురించి మాట్లాడుకునే అవకాశాన్ని నువ్వే ఇస్తున్నావ్.. నీకు ఏదైనా చెప్పాలని ఉంటే నాతో చెప్పు డైరెక్ట్‌గా ఐ యామ్ ఇండివిడ్యువల్ అని రాసేటంత పెద్ద గొడవ అవ్వలేదు మనిద్దరికీ క్లాప్ పీకాడు షణ్ముఖ్. దీంతో సిరి.. పేపర్ మడతపెట్టి పక్కనపెట్టేసింది. వెంటనే తన బెడ్ దిగి షణ్ముఖ్ బెడ్ ఎక్కేసింది.
ఎప్పటి మాదిరిగానే ఈ ఇద్దరు చీకట్లో రొమాన్స్ ప్రారంభించారు. సిరి తన బెడ్‌పై నుంచి లేచి షణ్ముఖ్ బెడ్‌పైకి వెళ్లడం ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడాన్ని చూసిన సన్నీ షాకయ్యాడు. సిరి ప్రవర్తన గురించి ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎందుకు ఇలా చేస్తుంది అనే దానిపై తెగ ముచ్చటించుకుంటున్నారు. బిగ్ బాస్ రేటింగ్ కోసం ఇలా చేయిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.