సినిమాలతోనే కాదు సోషల్ మీడియా పోస్టులతో కూడా ఎంటర్టైన్ చేస్తూ నెటిజన్లలో జోష్ నింపుతుంటుంది సన్నీలియోన్ (Sunny Leone). వెకేషన్ వెళ్లినపుడు దిగిన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ సారి ఓ పెయింటింగ్ స్టిల్‌తో నెటిజన్లను పలుకరించింది సన్నీలియోన్. పొట్టి డ్రెస్‌లో రెడ్ సోఫా చైర్ పై కూర్చున్న సన్నీలియోన్ గుర్రం చిత్రాన్ని (portrait of a horse) పెయింటింగ్‌గా వేసిన ఫొటో ఫ్రేమ్‌ను చేతిలో పట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది.
మజ్ను భాయ్ (Majnu Bhai Portrait) చిత్రంలో అనిల్ కపూర్ (Anil Kapoor) వేసిన ఈ పెయింటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సన్నీలియోన్. ప్రముఖ పెయింటర్ ఎవరో ఊహించండి..అంటూ #SunnyLeone, #MajnuBhai హ్యాష్ ట్యాగ్‌లను జోడిస్తూ…అనిల్ కపూర్, ఆర్ట్ డైరెక్టర్ అనీస్ బజ్మీకి ట్యాగ్ చేసింది సన్నీలియోన్. ఈ పోస్టుపై అనిల్ కపూర్ స్పందిస్తూ…మజ్నుభాయ్ కళా ప్రపంచం…ఇండియాలో చాలా ఫేమస్ అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టాడు.
సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న కోకా కోలా, హెలెన్ చిత్రాల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ