Sunny Deol | బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్న చిత్రం జాట్ చిత్రం. ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమ ట్రైలర్ రిలీజ్ విడుదలవగా.. మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరో సన్నీ డియోల్ బాలీవుడ్‌కు కీలక సూచనలు చేశాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమల నిర్మాతలను ప్రశంసిస్తూ.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వారిని చూసి సినిమాలు తీయడం నేర్చుకోవాలని సూచించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీనటులను గౌరవించే పద్ధతి తనను ఆకట్టుకుందని చెప్పాడు. సినిమా నిర్మాణంలో స్పష్టత బాలీవుడ్‌కు ఆదర్శనీయమని చెప్పాడు. టాలీవుడ్‌తో కలిసి పనిచేయడం తనకు నచ్చిందని చెప్పారు. నిర్మాతలతో మరో సినిమా చేద్దామని చెప్పాని.. బహుశా నేను అక్కడే (దక్షిణాది) స్థిరపడుతానని తెలిపాడు.
ఒకప్పుడు బాలీవుడ్లో దర్శకులు చెప్పినట్లుగా నిర్మాతలు చేసేవారని.. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయారన్నారు. అందరు బాలీవుడ్ అని పిలుస్తారని.. తాను మాత్రం హింద్రీ చిత్ర పరిశ్రమగానే పిలుస్తానని చెప్పాడు. ‘జాట్’ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ ప్రయాణం గదర్-2 సమయంలో మొదలైందని తెలిపాడు. దర్శకుడు గోపీ మలినేనిని గోవాలో కలిసినట్లు తెలిపాడు. ఆ సమయంలోనే సినిమా స్టోరీ చెప్పినట్లు వివరించారు. సన్నీ డియోల్ నటిస్తున్న ‘జాట్’ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.