గదర్ 2, జాట్ చిత్రాలతో వరుస విజయాలను నమోదు చేశారు బాలీవుడ్ స్టార్హీరో సన్నీడియోల్. ప్రస్తుతం ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తున్నది. బాలకృష్ణ ‘అఖండ 2’లో ఆయన ఓ ప్రత్యేక ఆకర్షణగా మెరవనున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన షెడ్యూల్‌ని జార్జియాలో ప్లాన్ చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ షెడ్యూల్లోనే సన్నీడియోల్ జాయిన్ అవుతారని సమాచారం. సెకండ్ హాఫ్‌లో ఈ పాత్ర ఎంట్రీ ఉంటుందని, ఈ పాత్ర ద్వారా ైక్లెమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ ‘అఖండ 3’కి లీడ్ అవుతుందట. ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలీదుకానీ బాలయ్య అభిమానుల్లో మాత్రం ఈ వార్త మంచి కిక్‌ను నింపుతున్నది. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ ఓ కీలక పాత్రల్లో పోషిస్తున్న విషయం తెలిసిందే.