బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మ్రైత్రీ మూవీమేకర్స్ అధినేతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది సన్నీడియోల్ వందవ చిత్రం కావడం విశేషం. సన్నీడియోల్ రీసెంట్ హిట్ ‘గద్దర్ 2’ 60 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, దాదాపుగా 700కోట్ల వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. ‘గద్దర్ 2’ తర్వాత వస్తున్న సన్నీడియోల్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్నీడియోల్ పుట్టినరోజు సందర్భంగా శనివారం మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో సన్నీడియోల్ పవర్‌ఫుల్‌గా, ఊద్వేగపూరితమైన రూపంలో కనిపిస్తున్నారు. శరీరమంతా రక్తపు మరకలతో ఓ పెద్ద ఫ్యాన్‌ని పట్టుకొని ఉన్న ఈ పోస్టర్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. రణదీప్ హుడా, వినీత్ కుమార్‌సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబి, సంగీతం: ఎస్.థమన్,