Sunny Deol | సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హై ఇంటెన్సెటీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, సన్నీ డియోల్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. పోరాట ఘట్టాలు ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతాయని దర్శకుడు తెలిపారు. సయామీఖేర్, రెజీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: గోపీచంద్ మలినేని.