Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్కమ్ చెప్పింది.
అయితే సునీతా విలియమ్స్ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక సునీతా విలియమ్స్ ల్యాండింగ్‌కు సంబంధించి 2013లో వచ్చిన హాలీవుడ్ మూవీ గ్రావిటీ సినిమాకు గుర్తుకుతెచ్చింది. 2013లో హాలీవుడ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం గ్రావిటీ(Gravity). ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ సాండ్రా బుల్లక్ కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో సాండ్రా బుల్లక్ అంతరిక్షం నుంచి భుమికి ల్యాండ్ అయిన సన్నివేశం ప్రస్తుతం సునీత విలియమ్స్ ల్యాండింగ్‌ను గుర్తుకుతెస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి.
గ్రావిటీ సినిమా కథ విషయానికి వస్తే.. అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక సమస్య రాగా దానిని పరిష్కారించడానికి నలుగురు ఇంజనీర్లు అంతరిక్షం వెళతారు. ఇందులో డాక్టర్ రైయన్ స్టోన్ (సాండ్రా బుల్లక్)తో పాటు మాట్ కోవాల్స్కీ (జార్జ్ క్లూనీ) తదితరులు ఉంటారు. టెలిస్కోప్‌లో ఉన్న సమస్యను వీరు రిపేరు చేస్తుండగా.. ఉన్నట్టుండి రష్యన్ ఉపగ్రహం ధ్వంసం అవుతుంది. దీంతో ఉపగ్రహం ధ్వంసం వలన ఏర్పడిన శకలాలు హబుల్ టెలిస్కోప్ వైపు దుసుకువచ్చి వాటిని నాశనం చేయడంతో అందులో ఉన్న ఇద్దరు ఇంజనీర్లు అక్కడిక్కడే మరణిస్తారు. ఇందులో నుంచి బయటపడిన డాక్టర్ రైయన్ స్టోన్ అంతరిక్షంలో దారి తప్పుతుంది. అయితే కొన్ని రోజులు అంతరిక్షంలోనే గడిపిన రైయాన్ చివరికి భుమికి ఎలా చేరుకుంది అనేది ఈ సినిమా కథ. 2013లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగానే కాకుండా.. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌తో, ఉత్తమ చిత్రంతో పాటు దాదాపు 7 ఆస్కార్లు దక్కించుకుంది.
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025