కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి..హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు. కలర్ ఫొటో, పుష్ప సినిమాలతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇపుడు మళ్లీ ఎఫ్ 3 (F3) సినిమాతో తనలోని కామెడీ యాంగిల్‌ను ఆడియెన్స్ కు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఆ క్రేజీ యాక్టర్ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అతనే టాలీవుడ్ యాక్టర్ సునీల్ (Sunil).
అందాల రాముడు (Andala Ramudu), మర్యాద రామన్న (Maryada Ramanna) సినిమాల సక్సెస్ తర్వాత హీరోగా కామిక్ టైమింగ్‌తో కూడిన సినిమాలు చేసినా..వర్కవుట్ కాలేదు. ఇపుడు ఎఫ్ 3 సినిమాతో మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో కనిపించేందుకు రెడీ అయ్యాడు. లీడ్ రోల్స్ లో సినిమాలు చేయడంపై ఆశలు వదులుకున్నట్టు గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే రీసెంట్గా చెప్పిన మాటలతో అలాంటిదేమి లేదని తేలిపోయింది. త్వరలోనే ఓ పెద్ద ప్లాన్‌తో ముందుకు రానున్నట్టు చెప్పిన సునీల్..మళ్లీ హీరోగా నటించాలనుకుంటున్నట్టు చెప్పాడు.
దశాబ్దకాలానికిపైగా కమెడియన్‌గా అలరించి, క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్న సునీల్..మళ్లీ తనలోకి హీరోను బయటకు తీయబోతున్నాడన్న అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి ఇంతకీ హీరోగా రీఎంట్రీ ఇచ్చేందుకు ఎంత పెద్ద ప్లాన్ వేసుకుంటున్నాడోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.