Bhuvana Vijayam | టాలీవుడ్ నటుడు సునీల్ (Sunil) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ భువన విజయమ్ (Bhuvana Vijayam). యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన భువన విజయమ్ (Bhuvana Vijayam Trailer) ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి సోల్ ఆఫ్ భువన విజయమ్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ థీమ్‌తో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ వీడియోలకు నెట్టింట స్పందన వస్తోంది.
భువన విజయమ్ నుంచి లాంఛ్ చేసిన Birth Of Bhuvana Vijayam వీడియోతో సునీల్ ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో ఎంటర్టైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు వెన్నెల కిశోర్ (Vennela Kishore) రామస్వామి క్యారెక్టర్ గ్లింప్స్ కూడా వినోదాత్మకంగా సాగబోతున్నట్టు డైరెక్టర్ తెలియజేశాడు. ఈ వీడియో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే సాగుతూ వినోదాన్ని పంచడం పక్కా అని అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ రిలీజ్ డేట్ ప్రకటించే కంటే ముందు నుంచే పక్కా ప్లాన్‌తో గ్లింప్స్ వీడియోలు లాంఛ్ చేస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
భువన విజయమ్ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోతోపాటు కథన కదనమున థీమ్ సాంగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న భువన విజయమ్లో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Soul of BhuvanaVijayam అవుట్ :
Mr RamaSwamy గ్లింప్స్ వీడియో ..
భువన విజయమ్ టీజర్..
Birth Of Bhuvana Vijayam వీడియో..