ఇప్పటి వరకు కామెడీ పాత్రలతో పాటు హీరోగాను నటించి అలరించిన సునీల్ తొలి సారి పుష్ప కోసం విలన్‌గా మారాడు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో కనిపించనుండగా, కొద్ది సేపటి క్రితం ఆయన లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సునీల్ బట్ట తలతో, భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ కనిపించాడు. సునీల్ లుక్ చూసి అందరు స్టన్ అవుతున్నారు.
తొలి పార్ట్‌లో సునీల్ విలన్‌గా కనిపించనుండగా, ఈ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కో … దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా… రీసెంట్గా విడుదలైన మూడో సింగిల్ ” సామి సామి ” కూడా రచ్చరచ్చ చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.