సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ’సైకలాజికల్ థ్రిల్లర్’ అని ఉపశీర్షిక. గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘నాగేశ్వరరెడ్డి నాకు ఇష్టమైన దర్శకులు. నా కెరీర్లో సీమశాస్త్రి, సీమటపాకాయ్ వంటి విజయాల్ని అందించారు.
ఆయన కథనందించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ సినిమాలో తాను సీరియస్ రోల్‌ను పోషించానని ధనరాజ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ నాగేశ్వర రెడ్డిగారే. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిన చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.