Sundeep Kishan | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వినూత్న కథలను ఎంచుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో విఐ అనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సందీప్ చేతిలో మంత్ర దండంలాంటి కర్రను పట్టుకుని ఎదురుగా భగ భగ మండే సూర్యుడు, చూట్టూ కూలిన రాళ్ళ కట్టడం ఏదో కొత్త లోకంలో ఉన్నట్లుగా పోస్టర్‌ను కథకు తగ్గట్లుగా డిజైన్ చేసినట్లు ఉంది. ఫస్ట్‌లుక్‌తోనే చిత్రబృందం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ సమర్పణలో హస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నాడు.
Hasya Movies now Presenting the first look of our first project #SK28 in association with @AKentsOfficial. Happy Birthday to our Hero @sundeepkishan pic.twitter.com/aR8mk9hgRo
— Rajesh Danda (@RajeshDanda_) May 7, 2022