టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రేమలో పడ్డాడా..? అంటే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు అవుననే అంటున్నాయి. సందీప్ కిషన్ ఆ అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాడా..? ఇంతకీ అమ్మాయి ఎవరు..? అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే బాలీవుడ్ నటి సోనియా రథీ (Sonia Rathee). మాధవన్‌తో కలిసి డీకపుల్డ్ సినిమాతోపాటు బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ 3 (Broken But Beautiful 3) సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీ చిత్రం తారా వర్సెస్ బిలాల్ లో నటిస్తోంది.
నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ అయిన సోనియా రథీ ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేసింది. హైదరాబాద్ తర్వాత సందీప్ కిషన్ ఎక్కువగా ముంబైకు వెళ్తుంటాడని తెలిసిందే. సోనియా ఇటీవలే సందీప్ తో కలిసి తిరిగిన స్టిల్స్ ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ముంబైను రెండో ఇల్లుగా చేసుకున్న సందీప్ కిషన్, యూఎస్ సిటిజన్ (హర్యానా వాసి) అయిన సోనియాతో డేటింగ్లో ఉన్నారనడానికి ఇవే కారణమని నెటిజన్లు అంటున్నారు.
సందీప్ కిషన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి మైఖేల్ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొత్తానికి హ్యాపీమూడ్‌లో నెటిజన్ల కంట పడుతున్న సందీప్ కిషన్-సోనియా రాబోయే రోజుల్లో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి మరి.