గతంలో నితిన్ కథానాయకుడిగా ‘వపర్ పేట’ పేరుతో ఓ సినిమా అనుకున్నారు. రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాల్సింది. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే.. ఇప్పుడు ఆ ‘పవర్ పేట’ను అటక నుంచి దించారు రైటర్ కృష్ణ చైతన్య. ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయి.
70ఎం ఎం ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఇప్పుడు హీరో నితిన్ కాదు.. సందీప్ కిషన్. రీసెంట్గా సందీప్కిషన్కి కథ కూడా వినిపించి ఓకే అనిపించుకున్నారట కృష్ణ చైతన్య. వచ్చే నెల 9న ఘనంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నట్టు తెలుస్తున్నది. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.