కృష్ణసాయి, మౌర్యాని, ఈషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరాంగుడు’. వినయ్‌బాబు దర్శకుడు. చందర్‌గౌడ్, ఎం.ఎస్.కె రాజు నిర్మిస్తున్నారు. బుధవారం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో కృష్టసాయి మాట్లాడుతూ ‘వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. ప్రేమకు అందం కొలమానం కాదని ఓ యువకుడు ఎలా నిరూపించాడన్నది ఆకట్టుకుంటుంది. సినిమాలో ఏడు పాటలుంటాయి. సెన్సార్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. రీతూ, సాక్షిశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమాన్.