అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నది. శనివారం ఈ సినిమా నుంచి ‘సుమతి సుమతి’ అనే రెండో పాటను విడుదల చేశారు.
గోల్డ్ దేవరాజ్ స్వరాల్ని అందించిన ఈ పాటను కృష్ణ మాదినేని రచించారు. చక్కటి ప్రేమ భావనలతో ఆకట్టుకుంటూ ఈ పాట సాగింది. తెలుగుతనం కలబోసిన చక్కటి కుటుంబ కథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.హలేష్, సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.