‘హాస్యం పండించడం అంత సులువు కాదు. మా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ విషయంలో విజయం సాధించారు. కథ చెప్పినప్పుడు ఎంత ఫన్‌గా అనిపించిందో థియేటర్లో సినిమా చూస్తూ కూడా అంతే నవ్వుకున్నాం. నాలుగురోజుల్లో 8.5కోట్ల వసూళ్లు వచ్చాయి’ అన్నారు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా. ఆయన నిర్మాణంలో సుమంత్ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు.
సోమవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ‘రోమాంచకం’తో తమ బ్యానర్లో మరో హిట్ సినిమా చేరడం ఆనందంగా ఉందని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. ఈ సినిమా చూస్తే ప్రతీ ఒక్కరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారని హీరో సుమంత్ ప్రభాస్ అన్నారు. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఆర్టిస్టులందరూ సెటిల్డ్‌గా నటించారు. ప్రేక్షకులు మాకు బ్లాక్‌బస్టర్ సినిమా అందించారు. థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే సంతోషంగా అనిపించింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.