హీరో సుమంత్ సినిమాల వేగాన్ని పెంచారు. ఆయన కథానాయకుడిగా వారాహి, అనగనగా ఒక రౌడీ చిత్రాలను ఇప్పటికే ప్రకటించారు. ఇదిలావుండగా సుమంత్ తాజా సినిమా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. కృషి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తారు. వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, సుమంత్ గత చిత్రాలకు భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. కాజల్ చౌదరి, విహర్ష యడవల్లి తదితరులు ఈ చిత్ర తారాగణం.